తెలంగాణ

telangana

ETV Bharat / state

Komatireddy Venkat Reddy Latest News : 'కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సీఎం ఎవరైనా తొలి సంతకం దానిపైనే' - 4000 పింఛన్‌పై వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు

Venkat Reddy on RS.4000 Pension : తెలంగాణలో రానున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరైనా.. తొలి సంతకం రూ.4 వేల పింఛన్లపైనే ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల వద్ద జాతీయ రహదారి పనులను ఆయన పరిశీలించారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకు రూ.200 పింఛన్‌ ఇచ్చామని.. ఇప్పటి లెక్కలతో పోలిస్తే రూ.4000 అవుతుందని తెలిపారు.

Komatireddy Venkat Reddy Latest News
Komatireddy Venkat Reddy Latest News

By

Published : Jul 10, 2023, 8:02 PM IST

Venkat Reddy inspected the national highway works at Patimatla : తెలంగాణలో రానున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరైనా.. తొలి సంతకం రూ.4 వేల పింఛన్లపైనే ఉంటుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల వద్ద జాతీయ రహదారి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకు రూ.200 పింఛన్‌ ఇచ్చామని.. ఇప్పటి లెక్కలతో పోలిస్తే రూ.4000 అవుతుందని తెలిపారు. అదే రూ.4000 ఇస్తామని హామీ ఇచ్చామని.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరైనా.. మొదటి సంతకం దానిపైనే చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే కొల్లాపూర్‌ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ వచ్చి.. బీసీ డిక్లరేషన్, సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం, రూ.2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యేల అతి పెద్ద కాన్వాయ్‌లు తీసేస్తే.. ఈ పథకాలన్నీ అమలు చేయడం కష్టమేమీ కాదన్నారు.

రానున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరైనా తొలి సంతకం రూ.4 వేల పింఛన్లపైనే చేస్తాం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకు రూ.200 పింఛన్‌ ఇచ్చాం. ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ ఇచ్చాం. ఇప్పటి లెక్కలతో పోలిస్తే అది రూ.4000 అవుతుంది. అదే రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం. తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి అయినా మొదటి సంతకం దానిపైనే చేయబోతున్నాం. - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే హైదరాబాద్ ఓఆర్ఆర్.. గౌరెల్లి నుంచి వలిగొండ మీదుగా తిరుమలగిరి, భద్రాచలం వరకు రూ.2,200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జాతీయ రహదారి.. మొదటి విడతలో వలిగొండ నుంచి తిరుమలగిరి వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇటీవల తిరుమలగిరిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని.. అందులో ఈ జాతీయ రహదారులు తామే వేయించామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక ఎంపీల అభ్యర్థన మేరకు జాతీయ రహదారులు వేయిస్తుందని.. కేటీఆర్‌ విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు.

అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ గుండ్ల వాణీ భరత్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కౌన్సిలర్ గుండ్ల వాణీ భరత్‌తో పాటు అరుణ గుణశేఖర్, ముక్కెర్ల మల్లేశ్‌, సరోజన హరీశ్‌.. వారి అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి తిరిగి వచ్చిన వారందరికీ స్వాగతం చెబుతున్నానన్న ఆయన.. వీళ్లంతా కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు ఎంతో బాధపడ్డానన్నారు. ఇప్పుడు తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి నాయకులను లాగేసుకుని గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జన గర్జన సభను అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారని.. అయితే ఈసారి ప్రజలంతా తమవైపే ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను గెలిపించాలని చూస్తున్నారని.. కార్యకర్తలు కష్టపడి పని చేసి లక్ష్యాన్ని చేరుకుందామని సూచించారు.

'కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సీఎం ఎవరైనా తొలి సంతకం దానిపైనే'

ఇవీ చూడండి..

Komati reddy: మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలి: కోమటిరెడ్డి

సర్వేల ఆధారంగానే హంగ్ వస్తుందని చెప్పా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details