'కేసీఆర్ పరిపాలనను గాలికొదిలేశారు' - congress
రాష్ట్రంలోని ప్రధాన శాఖలను తనవద్ద పెట్టుకుని పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికొదిలేశారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఉద్యోగులు తప్పుచేస్తే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. అంతేగాని అందరిపైనా నేరారోపణలు చేయడం అనైతికమని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కోమటిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ప్రధానశాఖలు తనవద్ద పెట్టుకొని పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇవీ చూడండి: ధోనీ ఉంటే అలా... లేకపోతే ఇలా..!
Last Updated : Apr 19, 2019, 8:17 AM IST