ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్షకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఐకాస నేత ఆరోగ్యంపై ఆరా తీసిన ఎంపీ.. ఆయనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పారు ఆర్టీసీ ఐకాస నిర్ణయాల మేరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. ఈనెల 19న జరిగే సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అశ్వత్థామరెడ్డి దీక్షకు మద్దతు: ఎంపీ కోమటిరెడ్డి - mp komati reddy supports rtc strike
నిన్నటి నుంచి స్వీయ గృహనిర్బంధంలో నిరవధిక దీక్షకు దిగిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు పలికారు.
అశ్వత్థామరెడ్డి దీక్షకు మద్దతు: ఎంపీ కోమటిరెడ్డి