మునుగోడు నియోజవర్గంలో ఉన్న ఎస్సీలందరికి దళిత బంధు పథకాన్ని(dalitha bandhu telangana) అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(mla komatireddy rajagopal reddy) పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గలకు నిధులు ఇవ్వకుండా సీఎం కేసీఆర్... వివక్ష చూపుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నా.. అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలకు రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి రిబ్బన్ కట్ చేయడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ఎద్దేవా చేశారు.
ఇప్పటికీ అదే మాట మీదున్న..