నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవటానికి తెరాస పార్టీకి చెందిన 6 గురు మంత్రులు ఇక్కడే మకాం వేసి క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ 80 వేల నుంచి లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 నుంచి 6 ఎంపీ సీట్లను గెలుస్తామని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెరాస క్యాంపు రాజకీయాలు చేస్తోంది: కోమటి రెడ్డి - komati reddy-fire on-Trs camp politics
ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస చేస్తున్న క్యాంపు రాజకీయాలపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 నుంచి 6 స్థానాలను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

తెరాస క్యాంపు రాజకీయాలు చేస్తోంది: కోమటి రెడ్డి