కొవిడ్‌తో మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు వెనకడుగు వేస్తున్నారు. ఈసమయంలో ఆలేరు మండలం కొలనుపాక సర్పంచ్ చూపిన చొరవకు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మానవత్వాన్ని చాటుకున్న కొలనుపాక సర్పంచ్ - తెలంగాణలో కరోనాతో మృతుల సంఖ్య
కొవిడ్ మహమ్మారి రక్తసంబంధాలను మంటగలుపుతోంది. రక్తసంబంధీకులు మృతి చెందినా కనీసం అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి. ఈ సమయంలో ఆలేరు మండలం కొలనుపాక సర్పంచ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు.
తెలంగాణ వార్తలు
ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి... మృతునికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పీపీఈ కిట్లు తెప్పించి మృతుని కుమారులకు, ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇచ్చి మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చారు. సర్పంచ్ స్పందించిన తీరును పలువురు అభినందించారు.