తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయ సమ్మతమైన పరిహారం చెల్లించండి - తెజస

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితులను తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కలిశారు. గ్రామంలోని ప్రాజెక్టు నిర్మాణ బ్లాస్టింగ్ పనుల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.

పరిహారం చెల్లించండి

By

Published : Sep 3, 2019, 7:34 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయ సమ్మతమైన పరిహారం చెల్లించాలని తెజస అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. నిర్వాసితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ బ్లాస్టింగ్ పనుల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. నిర్వాసితులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం స్పందించక పోవటం వల్ల అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.

పరిహారం చెల్లించండి

ABOUT THE AUTHOR

...view details