తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో సహస్రాష్టక కుండయాగం - yadagiri

యాదాద్రి నిర్మాణానంతరం మరో యాగం చేసేందుకు కేసీఆర్ నిశ్చయించారు. 1008 కుండాలతో సహస్రాష్టక కుండయాగం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 11 రోజులపాటు జరిగే ఈ యాగానికి రాజకీయ ప్రముఖులందరూ హాజరుకానున్నారు.

సీఎం సహస్రాష్టక యాగం

By

Published : Feb 5, 2019, 10:23 AM IST

Updated : Feb 5, 2019, 2:12 PM IST

సీఎం సహస్రాష్టక యాగం
ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. టెంపుల్ సిటీగా మారుతున్న యాదాద్రి వేదికగా సహస్రాష్టక కుండయాగం చేయాలని సంకల్పించారు. ఆలయ పునరుద్ధరణ పులన్నీ పూర్తయిన తర్వాత ఈ క్రతువు చేపట్టనున్నారు. 1008యాగ కుండలతో 11రోజుల పాటు వైభవోపేతంగా మహాయాగం నిర్వహించనున్నారు.
సహస్రాష్టక కుండ యాగానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వనించనున్నారు ముఖ్యమంత్రి. లక్షలాదిమంది భక్తులు పాల్గొనే ఈ మహాయాగం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడానికి ఓ కమిటీని నియమించారు.
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సంక్షేమ-అభివృద్ధి పథకాలు నిర్విరామంగా కొనసాగాలని ఈ కుండయాగాన్ని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Last Updated : Feb 5, 2019, 2:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details