సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 15, 16, 17 తేదీల్లో సుమారు లక్షా ముప్పైరెండు వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టామని టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామ పరిధిలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో సీఎం కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలను జరిపారు. పార్క్‌లో ఈచ్ వన్- ప్లాంట్ వన్ నినాదంతో మొక్కలు నాటారు.
సీఎం పుట్టినరోజు సందర్భంగా లక్షా ముప్పైరెండు వేల మొక్కలు
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌లోని గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఈచ్ వన్- ప్లాంట్ వన్ నినాదంతో మొక్కలు నాటారు. ఫిబ్రవరి 15, 16, 17 తేదిల్లో సుమారు లక్షా ముప్పైరెండు వేల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తామని టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు.
సీఎం పుట్టినరోజు సందర్భంగా లక్షా ముప్పైరెండు వేల మొక్కలు
అనంతరం లాంగ్ లీవ్ కేసీఆర్ నినాదాలతో కేక్ కట్ చేసి.. మిఠాయిలు పంచుకున్నారు. హరితహారంలో భాగంగా ఇండస్ట్రీయల్ పార్క్‌లో మొక్కలను పెంచి కేసీఆర్‌కు బహముతిగా ఇస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్