కార్తిక మాసం పురస్కరించుకుని యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి శివాలయంలో శనివారం రాత్రి కార్తిక దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తిక దీపాలు వెలిగించారు. ధర్మ జాగరణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో వివిధ రకాల ఆకారాల్లో శివలింగం, స్వస్తిక్, ఓం, పలు ఆకృతులతో మహిళలు ఆలయంలో దీపాలు వెలిగించారు.
యాదగిరిపల్లి శివాలయంలో కన్నుల పండువగా కార్తిక దీపోత్సవం - యాదగిరిపల్లి శివాలయం
కార్తిక దీపాల వెలుగులతో శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లి శివాలయం కాంతులీనింది. కార్తిక మాసం సందర్భంగా ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ఆ ఆలయంలో కార్తిక దీపోత్సవం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో మంగళహారతులతో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యాదగిరిపల్లి శివాలయంలో కన్నుల పండువగా కార్తిక దీపోత్సవం