యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తాండ్ర అమరావతి చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల విలువైన చెక్కులను 38 మంది లబ్ధిదారులకు అందజేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ - yadadri bhuvanagiri district news
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎంపీపీ అమరావతి చెక్కులను పంపిణీ చేశారు. మెుత్తం 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ఎంపీపీ తమ చేతుల మీదుగా 38 మంది లబ్దిదారులకు 38 లక్షల 4వేల 408 రూపాయల విలువైన చెక్కులను అందజేసినట్లు తహసీల్దార్ దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కోలుకొండ లక్ష్మి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, తహసీల్దార్ దయాకర్ రెడ్డి, ఎంపీడీవో పుష్ప లీల, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా నుంచి కోలుకున్న గొంగిడి సునీత దంపతులు