తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధునిక హంగులతో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణకట్ట - లక్ష్మీనరసింహ స్వామి లేటెస్ట్​ వార్తలు

యాదాద్రి క్షేత్ర అభివృద్ధిలో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారికి తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట నిర్మితమవుతోంది. కొండ కింద గల గండి చెరువు వద్ద రూ.20 కోట్ల అంచనా వ్యయంతో యాడా దీన్ని నిర్మిస్తోంది.

kalyana katta construction in yadadri
ఆధునిక హంగులతో కల్యాణ కట్ట

By

Published : Jan 23, 2021, 10:49 AM IST

భక్తులు.. లక్ష్మీనరసింహ స్వామి వారికి తలనీలాలు సమర్పించేందుకు వీలుగా యాదాద్రిలో కల్యాణకట్ట నిర్మిస్తున్నారు. కొండ కింద గల గండి చెరువు వద్ద రూ.20 కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి అర్బన్ డెవలప్​మంట్ అథార్టీ దీనిని నిర్మిస్తోంది. సుమారు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణం చేపట్టారు. మహిళలు, పురుషులకు వేరువేరు గదులు, నాయిబ్రహ్మణులు, మొక్కులు తీర్చుకునే భక్తుల కుటుంబీకులు వేచి ఉండేలా సముదాయాలు నిర్మిస్తున్నారు.

కల్యాణ కట్ట నిర్మాణం పూర్తయితే.. ఇక్కడ ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళలు తలనీలాలు సమర్పించేందుకు వీలుందని యాడా అధికారులు తెలిపారు. మూత్రశాలలతో సహా క్లాక్ రూమ్స్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:చైనాలో రుణాల యాప్‌ల రూపకల్పన.. గుర్తించిన పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details