తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో ఆలయ ప్రాకార మండప విమానాలపై కలశాలు బిగింపు.. - యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కలశాల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత మహా బలిపురం నుంచి తెప్పించిన రాగి కలశాలను ఆలయం నలువైపులా ఉన్న అష్టభుజి మండప ప్రాకారాలపై ఉన్న విమానాలపై కలాశాలు ఏర్పాటు చేస్తున్నారు.

kalashalu fitting works started in yadadri temple
kalashalu fitting works started in yadadri temple

By

Published : Mar 9, 2022, 9:12 AM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కలశాల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. పంచ నారసింహుల దివ్యాలయంపై కలశాల స్థాపన ప్రక్రియకు అర్చకులు శ్రీకారం చుట్టారు. విస్తరించిన కృష్ణశిలతో పునర్ నిర్మించిన ఆలయ ఉద్ఘాటనలో ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణకు ముందుగా.. త్రిదండి చిన జీయర్ స్వామి సలహాతో కలశాల స్థాపన పనులు చేపట్టినట్లు యాడా నిర్వాహకులు తెలిపారు.

యాదాద్రిలో ఆలయ ప్రాకార మండప విమానాలపై కలశాలు బిగింపు..

తొలుత మహా బలిపురం నుంచి తెప్పించిన రాగి కలశాలను ఆలయం నలువైపులా గల అష్టభుజి మండప ప్రాకారాలపై ఉన్న విమానాలపై ఏర్పాటు చేస్తున్నారు. మొదటి, రెండు, నాలుగో ప్రాకారాలపై గల 24 విమానాలు రాగి కలశాలతో ఆవిష్కృతం కానున్నాయి. ఈ పనులు కాగానే గోపురాలపై స్థాపన చేపట్టనున్నారు.

యాదాద్రిలో ఆలయ ప్రాకార మండప విమానాలపై కలశాలు బిగింపు..
యాదాద్రిలో ఆలయ ప్రాకార మండప విమానాలపై కలశాలు బిగింపు..

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details