తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రీడా పోటీలను ప్రారంభించిన జడ్పీ ఛైర్మన్​ - జిల్లా స్థాయి క్రీడా పోటీలు

బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.

క్రీడా పోటీలను ప్రారంభించిన జడ్పీ ఛైర్మన్​

By

Published : Nov 14, 2019, 5:03 PM IST

బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్కూల్ పిల్లలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్​రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు.

విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని, భవిష్యత్​లో విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తేవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

క్రీడా పోటీలను ప్రారంభించిన జడ్పీ ఛైర్మన్​

ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details