యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో భాజపాలోకి భారీస్థాయిలో వలసలు కొనసాగుతున్నాయి. చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో పలు పార్టీల నుంచి దాదాపు 100 మందికి పైగా కమల దళంలో చేరారు.
'జైకేసారం నుంచి భాజపాలో భారీ చేరికలు' - గంగిడి మనోహర్ ఆధ్వర్యంలో భాజపాలోకి చేరికలు
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత భాజపాలోకి వలసలు పెరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో వివిధ పార్టీల నాయకులు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కమల తీర్థం పుచ్చుకున్నారు.
!['జైకేసారం నుంచి భాజపాలో భారీ చేరికలు' joining from other party leaders into bjp in yadadri bhuvanagiri dist in munugodu consstituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9984735-780-9984735-1608742791890.jpg)
'జైకేసారం నుంచి భాజపాలోకి భారీ చేరికలు'
జెండా ఆవిష్కరణ అనంతరం భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భాజపా పుంజుకుంటుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.