తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Temple: వచ్చే నెల 2 నుంచి యాదాద్రి నరసింహ జయంతి ఉత్సవాలు - యాదాత్రి తాజా

Jayathi Ustavalu At Yadadri: యదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మే 2వ తేది నుంచి 4 వరకు నరసింహ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 3రోజులు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఏఏ పూజలు నిర్వహిస్తారో తెలియజేశారు.

Yadadri Temple
Yadadri Temple

By

Published : Apr 25, 2023, 4:58 PM IST

Jayathi Ustavalu At Yadadri: యదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మే 2వ తేది నుంచి 4 వరకు నరసింహ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నాయి. ఈ ఉత్సవాలకి సంబంధించి ఏర్పాట్లు, పూజలు మొదలగు వాటిపై ఆలయ ఈవో గీతా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనె అవకాశం ఉండడంతో, స్వామి వారిని దర్శించుకోడానికి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏ రోజున ఏ పూజలు జరుగుతాయో, ఉత్సవాలు ఎలా ముగిస్తాయి అన్న అంశాలను వారు తెలియజేశారు. మే 2వ తేదిన జయంతి ఉత్సవాలు స్వస్తివాచనంతో ప్రారంభమై 4వ తేదీన నృసింహ ఆవిర్భావ ఘట్టంతో ముగిస్తాయని తెలిపారు. ఈ జయంతోత్సవాలు జరిగే 3 రోజులు భక్తులచే జరపబడే నిత్య, శాశ్వత కల్యాణం, నిత్యా, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం రద్దు చేయనున్నట్లు వెల్లడించారు.

"మే 2వ తేదిన స్వస్తివాచనం, విశ్వక్​సేన ఆరాధనతో ప్రారంభంకానున్నయి. ఉదయం 9.30 నిమిషాలకి స్వస్తివాచనంతో మొదలై ఆ రోజు సాయంత్రం లక్ష కుంకుమార్చనతో పూర్తయ్యి, 3వ రోజు లక్ష పుష్పార్చన, 4వ రోజు సహస్ర గఠాభిషేకము మిగిత కార్యక్రమాలన్ని వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి. 4వ రోజు సంధ్య సమయంలో ఆవిర్భావాహి పురస్కరించుకొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఆలయ సిబ్బందికి, అర్చకులకు పారాయణాదారులకి తగిన ఏర్పాట్లు చేశాము. వేసవి సమయంలో జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. వారికి సంబంధించి క్యూలైన్లు ఇతర సదుపాయాలు కల్పించడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహంతో సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుతున్నాను".-గీత రెడ్డి, ఆలయ ఈవో

"ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి పర్వదినాల్లో జయంతి మహోత్సవం చేయడం ఆలయ సంప్రదాయం. స్వస్తి వాచనంతో మొదలవుతుంది. మొట్టమొదటి సారిగా నూతన ఆలయంలో ఈ ఉత్సవాలు జరగడం విశేషం. మొదటి రోజుల తిరువేంకటపతి రూపంలో స్వామి వారు దర్శనమిస్తారు. కుంకుమార్చన, పుష్పార్చన సహస్ర ఘటాభిషేకాలు ఈ ఉత్సవానికి ప్రత్యేకత".-నల్లన్ దిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు

యాదాద్రిలో పంచనారసింహుల ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామ లింగేశ్వరస్వామి ఆలయ విస్తరణతో పునర్ నిర్మించారు. ఉద్ఘాటన జరిగి ఈ నెల 25 (మంగళవారం) నాటికి ఏడాదవుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details