తెలంగాణ

telangana

ETV Bharat / state

దాతృత్వం చాటుకున్న ఎస్సై... మాస్కులు, శానిటైజర్ల పంపిణీ - yadadri news

కరోనా కట్టడిలో భాగంగా జవహార్​నగర్​ ఎస్సై సైదులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. తన తల్లి కీ.శే. సుజాత గారి పేరుతో... సొంత ఖర్చుతో సుమారు రూ.60 వేలు వెచ్చించి గ్రామంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

javajharnagar si saidhulu distributed masks and sanitizers
javajharnagar si saidhulu distributed masks and sanitizers

By

Published : Sep 5, 2020, 9:54 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని పొడిచేడులో జవహార్​నగర్​ ఎస్సై సైదులు, తన సోదరుడు సతీశ్​తో కలిసి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. గ్రామంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా నివారణ కోసం ... సర్పంచ్ పేలపూడి మధు దాతల సాయం కోరారు. స్పందించిన ఎస్సై సైదులు... తన తల్లి కీ.శే. సుజాత గారి పేరుతో... సొంత ఖర్చుతో సుమారు రూ.60 వేలు వెచ్చించి గ్రామంలో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.

గ్రామంలో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా కట్టడిలో తాము భాగస్వామ్యం అయ్యేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సైదులు తెలిపారు. భవిష్యత్తులో గ్రామం కోసం తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. కరోనా కట్టడి కోసం ముందుకొచ్చినందుకు గ్రామ సర్పంచ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రామాన్ని ఆదుకోవడానికి మరికొంత మంది స్వచ్ఛందగా ముందుకు రావాలని సర్పంచ్ పేలపూడి మధు కోరారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా.చైతన్య కుమార్, ఉప సర్పంచ్ కప్పే వెంకటేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details