యాదాద్రి భువనగిరి జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. కరోనాను నిలువరించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైద్రాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎన్నడు లేని విధంగా రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
చౌటుప్పలో కొనసాగుతున్న కర్ఫ్యూ - జనతా కర్ఫ్యూ
యాదాద్రి భువనగిరి జిల్లాలో జనతా కర్ఫ్యూ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా కొనసాగుతోంది. చౌటుప్పల్‌లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టణ వాసుల స్వీయ నిర్బంధంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా కనపడుతున్నాయి.

చౌటుప్పలో కొనసాగుతున్న కర్ఫ్యూ
చౌటుప్పల్‌లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అన్ని ప్రధాన రహదారులు వాహనాల రాకపోకలు లేక మూగబోయాయి. ఎవరికి వారే స్వీయ నిర్బంధం విధించుకున్నారు. పట్టణంలోని దుకాణాలు, సంతలు, మార్కెట్లు, పెట్రోల్ బంకులన్ని మూతపడ్డాయి. పోలీసులు మొబైల్ వాహనాల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. అటు ఆడపాదడపా వస్తున్న వాహనాలను పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు.
చౌటుప్పలో కొనసాగుతున్న కర్ఫ్యూ
ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'