తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుక తరలించొద్దంటూ జానకిపురం గ్రామస్థుల ఆందోళన - janakipuram villagers protest

ఇసుక తరలింపు నిలిపివేయాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం జానకిపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వారిని బయటకు రానీయకుండా పోలీసులను మోహరించారు.

janakipuram, janakipuram villagers protest, yadadri bhuvanagiri district
జానకిపురం గ్రామస్థులు, జానకిపురం గ్రామస్థుల ఆందోళన, జానకిపురం గ్రామస్థుల ధర్నా

By

Published : May 2, 2021, 12:36 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్​ మండలం జానకిపురంలో ఇసుక తరలించొద్దని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వారిని బయటకు రానీయకుండా పోలీసులను భారీగా మోహరించారు. జానకిపురం సమీపంలోని బిక్కేరు వాగు నుంచి కొన్ని రోజులుగా ఇసుక తరలిస్తున్నారని.. తక్షణమే అది నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వాగు నుంచి ఇసుక తరలించడం వల్ల తాగు, సాగు నీరు లేక, భూగర్భ జలాలు అడుగంటి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక లారీని అడ్డుకుని ఆందోళనకు దిగిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని బయటకు రానీయకుండా.. నిర్బంధం చేశారు. అనుమతి చూపించిన తర్వాతే ఇసుక తరలించాలని గ్రామస్థులు చెప్పగా.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుత్తేదారులు ఇసుక తవ్వకం ఆపేందుకు అంగీకరించడంతో గ్రామస్థులు శాంతించారు.

ABOUT THE AUTHOR

...view details