ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జమ్మి పూజ కార్యక్రమం నిర్వహించారు. మొదటగా బాలాలయంలో ప్రత్యేక సేవ ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జమ్మి కొమ్మను పూజించారు.
యాదాద్రిలో ఘనంగా జమ్మి పూజ, ఆయుధ పూజలు - ayudha puja in yadadri temple
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దసరా సందర్భంగా జమ్మి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం పోలీస్ సిబ్బంది ఆయుధాలకు ఆలయ అర్చకులు పూజచేశారు.
![యాదాద్రిలో ఘనంగా జమ్మి పూజ, ఆయుధ పూజలు jammi puja on the occasion of vijaya dasami at yadadri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9312618-446-9312618-1603683969327.jpg)
యాదాద్రిలో ఘనంగా జమ్మి పూజ, ఆయుధ పూజలు
ఆలయంలో ఉండే పోలీస్ సిబ్బంది ఆయుధాలకు ఆయుధ పూజలు చేపట్టారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, అధికారులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.