తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతునికి అంత్యక్రియలు చేసిన ప్రజాప్రతినిధులు - corona deaths in telangana

కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పాతజాల గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్. గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి దహనసంస్కారాలు నిర్వహించారు.

corona deaths in yadadri, corona deaths in bhuvanagiri district
యాదాద్రిలో కరోనా కేసులు, యాదాద్రిలో కరోనా మరణాలు

By

Published : May 24, 2021, 7:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పాత జాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి (55) నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న అతను సోమవారం ఉదయం ఆయాసం ఎక్కువై పరిస్థితి విషమించి మరణించాడు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ గంధమయల్ల నర్సింహులు దహన సంస్కారాలకు కావాల్సిన ఖర్చులు కుటుంబానికి అందజేశారు. స్వయంగా వారే పంచాయతీ సిబ్బందితో కలిసి మృతునికి అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details