తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో ఆ నిర్మాణాలు చేపట్టి నేటికి మూడేళ్లు!

యాదాద్రి ఆలయానికి అదనపు సోయగాన్ని అందించేలా రూపుదిద్దుకుంటున్న అష్టభుజ మండప ప్రాకారాల నిర్మాణాలు చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తవుతోంది. ద్రవిడ, చోళ, కాకతీయ, కళారూపాలతో కూడిన ఈ ప్రాకారాలు భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని చాటనున్నాయి.

యాదాద్రి సోయగం
యాదాద్రి సోయగం

By

Published : May 22, 2021, 11:26 AM IST

యాదాద్రి ఆలయ సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. పంచనారసింహుల సన్నిధిని రూపొందించేందుకు కృష్ణశిలతో అష్టభుజ మండప ప్రాకారాలను నిర్మించారు. ఈ ప్రాకారాల నిర్మాణాన్ని చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తి చేసుకున్నాయి. ద్రవిడ, చోళ, కాకతీయ, కళారూపాలతో కూడిన ప్రాకారాలు భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని చాటనున్నాయి.

మహా విష్ణువునకు ప్రీతికరమైన అష్టభుజ ఆకారాలతో మండప ప్రాకారాలను సంపూర్ణంగా నల్లరాతితో నిర్మించడం విశేషం. ఆలయం నలువైపులా సుమారు 250 రకాల ఆధ్యాత్మిక బొమ్మలు.. 158 బాలపాదం స్తంభాలు, 54 యాలీ స్తూపాలతో ప్రాకారం రెండు తొలి రెండోమాఢ వీధుల్లో ఆవిష్కృతమైంది. ఈ తరహాలోని ప్రాకారం మరెక్కడా లేదని యాడా చెబుతోంది. నేర్పరులైన శిల్పకారులతో దశావతారాలు, నరసింహరూపాలు, గీతోపదేశం, రామాంజనేయులు, రామచంద్రుడు, బుర్రకథ, ప్రహ్లాద చరిత్ర, అడవి మృగాలు, నాట్య భంగిమల ప్రతిమలను ప్రాకారాల్లోని స్తూపాలపై.. రూపొందించినట్లు ప్రధాన స్తపతిగా వ్యవహరించిన డాక్టర్ ఆనందాచారి వేలు స్పష్టం చేశారు.

వైష్ణవత్వానికి దర్పణంగా..

వైష్ణవతత్వాన్ని ప్రభోదించేలా మృగనరహరి క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని చినజీయర్ స్వామి చేసిన సూచనలతో ఆలయాన్ని విస్తరించి కృష్ణశిలతో పునర్​ నిర్మించారు. ప్రాకారాలపై దేవతా మూర్తులతో సాలహారాలు.. నలుదిక్కుల్లో 24 విమానాలను ఏర్పాటు చేశారు. సదరు విమానాలపై స్వర్ణకలశాలు, సాలహారాల్లో అష్టలక్ష్మి, దిక్పాలకుల విగ్రహాల పొందిక పనులు జరగాల్సి ఉంది.

ఇదీ చూడండి: శైవవైష్ణవ సంగమ యాదాద్రి.. నూతనత్వంతో వినూత్న సొబగులు

ABOUT THE AUTHOR

...view details