కరోనా రోగుల చికిత్స కోసం వెంటనే ఐసోలేషన్ కేంద్రాన్ని జిల్లా ఆసుపత్రిలో ప్రారంభించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పీసీ శ్యామ్సుందర్ డిమాండ్ చేశారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించటంలో ప్రభుత్వం విఫలమైందని శ్యామ్ మండిపడ్డారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆసుపత్రిలోనే అన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కరోనా బాధితులకు వెంటనే ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించాలి : శ్యామ్ సుందర్ - కరోనా రోగుల చికిత్స.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిని జిల్లా భాజపా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్ పరిశీలించారు. అన్ని వార్డులు తిరుగుతూ వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై సిబ్బందిని, రోగులను అడిగి తెలుసుకున్నారు.
కరోనా బాధితులకు వెంటనే ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించాలి : శ్యామ్ సుందర్