యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రిక అందించారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం - telangana news today
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతిభవన్‌లో సీఎంను ఆలయ అధికారులు, ఆలేరు ఎమ్మెల్యే, విప్ గొంగిడి సునీత మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. నేటి నుంచి 11 రోజులపాటు యాదాద్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
ఆలయ ఈఓ గీతారెడ్డి, అర్చకులతో కలిసి ముఖ్యమంత్రిని స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. నేటి నుంచి ప్రారంభమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి.
ఇదీ చూడండి :ప్రజల పురోగతికి కట్టుబడి.. దేశానికే ఆదర్శంగా నిలిచాం: గవర్నర్