నల్గొండ జిల్లా కోర్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలు పూర్తయ్యాయి. ముగ్గురు విద్యార్థినులను దారుణంగా హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిపై విచారణ జరుగుతోంది.
మూడు కేసుల్లో నూటా ఒక్కమంది వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. నల్గొండలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులోని పోక్సో చట్టం కోర్టు ఈ వాంగ్మూలాలపై విచారణ సాగిస్తోంది.
నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఈ నెల 26న కోర్టులో హాజరుపరచనున్నారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను... అదే రోజు నిందితుడికి చదివి వినిపించనున్నారు. తదనంతరం వాటిపై... శ్రీనివాస్ రెడ్డి నుంచి అభిప్రాయాన్ని రికార్డు చేస్తారు.
ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇరుపక్షాల న్యాయవాదులు... తుది వాదనలు వినిపిస్తారు. మరో వారంలోగా.. ముగ్గురు విద్యార్థినుల హత్య కేసుపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.