యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేసేందుకు యాడ కృషి చేస్తోంది. ప్రధాన అలయాన్ని ప్రారంభించేందుకు సమయం దగ్గర పడుతుండటం వల్ల అధికారులు మౌలిక వసతులపై దృష్టి సారించారు. రూ.3 కోట్ల వ్యయంతో కొండ కింద పాత గోశాల ప్రాంగణంలో 300 మంది భక్తులకు సరిపోయే వసతి గృహాలు నిర్మిస్తున్నట్లు ఆలయ ఈవో గీతా రెడ్డి తెలిపారు.
యాదాద్రి క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతులపై దృష్టి - తెలంగాణ వార్తలు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల మౌలిక వసతులపై అధికారులు దృష్టి సారించారు. సామాన్యుల కోసం రూ.3కోట్ల వ్యయంతో వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నారు.
యాదాద్రి క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతులపై దృష్టి
సామాన్యుల కోసం చేపట్టిన వసతి గృహాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. పచ్చదనం కోసం మొక్కలను పెంచుతూ... చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఈ వసతి గృహాలను త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:యాదాద్రిలో తుది దశకు చేరిన వీఐపీ అతిథి గృహం పనులు