నాసిరకం చెరువు కట్ట, అధికారుల నిర్లక్ష్యం.. వెరసి గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు కట్ట తెగి నీరు వృథాగా పోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలోని జగ్గయ్య చెరువుకు బుంగ పడి నీరు వృథా అవుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. చెరువు అలుగును కొంతమేర తెగ్గొట్టి నీరు క్రిందకు విడుదల చేశారు. గ్రామస్థులు, రైతులు, చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
నాసిరకం చెరువు కట్ట.. ఇళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు - గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు తెగి నీరు ఇళ్లలోకి
నాసిరకం చెరువు కట్ట.. అధికారుల నిర్లక్ష్యం.. దీంతో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు కట్ట తెగి నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామస్థుల దీన స్థితి.
చెరువులో ఆరునెలల క్రితం మట్టిని ఇష్టారీతిన తీయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో చెరువు నిండినా రైతులకు సంతోషం లేకుండా చేస్తోంది. చెరువు కట్టకు పడిన బుంగతో మూడు రోజుల నుంచి నీరు వృథాగా పోతోందని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో జగ్గయ్య చెరువుకు దగ్గరగా ఉన్న మాధాపురం, కోమటి కుంట తండా, కాంచల్ తండా గ్రామాల్లోకి నీరు వస్తోందని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. కోమటి కుంట తండాలో పలువురు గ్రామస్థులు ఇళ్లు వదిలి వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ అధికారులు చెరువు పరిశీలించ పోవడం పలు విమర్శలకు తావిస్తోందని తండా వాసులు అంటున్నారు.
ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్.. మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్