నల్గొండ, యాదాద్రి జిల్లాలో నిన్న కూడా ఒక్కో పాజిటివ్ కేసు చోప్పున నమోదయ్యాయి. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్... ఈ నెల 29 నుంచి సెలవులో ఉన్నాడు. జ్వరం లక్షణాలతో స్వయంగా హైదరాబాద్లో పరీక్షలు చేయించుకోవడం వల్ల పాజిటివ్ తేలింది.
దీనితో ఆ కేసును జీహెచ్ఎంసీ పరిధిలో చేర్చారు. సదరు ఠాణాలో పనిచేస్తున్న మరో ముగ్గురిని హోం క్వారంటైన్ చేశారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోనూ... పాజిటివ్ నిర్ధారణయింది. తన భర్తకు అనారోగ్యంగా ఉందని గత నెల 29న గృహిణి... సూర్యాపేట ఆసుపత్రిని ఆశ్రయించింది. కిడ్నీ సమస్య వల్ల డయాలసిస్ చేయాల్సి ఉందంటూ... హైదరాబాద్ వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు.