రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అధికారుల సూచనల మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు.
నారసింహుని చెంతకు పోటెత్తిన భక్తులు - యాదాద్రి ఆలయం న్యూస్
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు.
![నారసింహుని చెంతకు పోటెత్తిన భక్తులు increased-crowd-of-devotees-in-yadadri-temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10104642-891-10104642-1609674976556.jpg)
నారసింహుని చెంతకు పోటెత్తిన భక్తులు
పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతవరణం కనిపించింది. కొండకింద కల్యాణ కట్ట, కొండపైన ప్రసాదాల విక్రయశాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటల సమయం , ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది. ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా వాహనాలను పోలీసులు అనుమతించక పోవడంతో ఆటోలు, ఆర్టీసీ బస్సులో భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు.