తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వయం ఉపాధి దిశగా.. 'అగరబత్తుల'తో అతివల ముందడుగు - వాగ్మీ పేరిట అగరుబత్తులు

Incense sticks industry: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేస్తున్నారు. జిల్లాకు చెందిన మహిళా సంఘం సభ్యులంతా ఒక్కటిగా ఏర్పడి "వాగ్మీ" బ్రాండ్‌ పేరిట అగరబత్తుల తయారీ చేపడుతున్నారు. ఈ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపుతేవటమే లక్ష్యమంటూ స్వయంకృషితో ముందుకు సాగుతున్నారు.

Incense sticks industry
Incense sticks industry

By

Published : Nov 11, 2022, 1:00 PM IST

ఆలేరులో అగరబత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసిన సంఘం మహిళలు

Incense sticks industry: మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా పాలానాధికారి పమేలా సత్పతి, అగరబత్తుల పరిశ్రమ విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన యంత్ర సామగ్రి కొనుగోళుకు సూమారు 6లక్షల రూపాయల ఆర్థిక సహాకారం అందించారు. దానితో పాటు సంఘం సభ్యులంతా డబ్బును సమకూర్చుకొని... ఆలేరులోని ప్రభుత్వ ఇండోర్‌ స్టేడియంలో "వాగ్మీ" బ్రాండ్‌ పేరిట అగరబత్తుల పరిశ్రమ ఏర్పాటు చేశారు.

తయారికీ కావాల్సిన కొన్ని ముడి సరుకులను యాదాద్రి దేవస్థానం అందిస్తుంది. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ సైతం దేవుడికి వినియోగించిన పుష్పాలతో అగరబత్తులు, దూది ఓత్తులు, దీపావళి పెన్సిళ్లు తదితర ఉత్పత్తులు చేపడుతున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. వీటిని వాగ్మీ కటాక్ష, వాగ్మీ సుమధుర పేరుతో యాదాద్రి దేవస్థానంతో పాటు స్థానిక మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 2 న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చారు.

ప్రస్తుతం అగరుబత్తుల తయారీ ముమ్మరంగా సాగుతోంది. దాదాపు 2 వేల ప్యాకెట్ల వరకూ అమ్మకానికి సిద్ధంగా పెట్టారు. అదే విధంగా దూది ఓత్తులు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బొమ్మలు, విగ్రహాలు, పసుపు, కుంకుమ, ఫొటో ఆల్బమ్‌లు తయారు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు సంఘం మహిళలు తెలిపారు. ఈ పరిశ్రమతో స్థానిక మహిళలకే కాకుండా ఈ ప్రాంతంలోని ఇతర రంగాల వారికి కూడా ఉపాధి లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతానికి యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో కొండపైన... అదే విధంగా భువనగిరి కలెక్టరేట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో విక్రయాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details