యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాదాద్రి పంచ నారసింహుల సన్నిధిని శిల్పకళా రూపాలతో తీర్చిదిద్దారు. మండప ప్రాకారంలోని కృష్ణశిల స్థూపాలపై ఆంజనేయ స్వామి, గరుడ ఆళ్వార్లు, త్రిలోక సంచారి, నారద మహర్షి, మహా విష్ణువు, నారసింహుని వివిధ రూపాలు, విష్ణుమూర్తి రూపాలు, శ్రీచక్రంతోపాటు శంకు తిరునామాలను చెక్కారు.
పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు శిల్పులు, ఇంజినీర్లు నిమగ్నమయ్యారు. ఈనెల 13న సీఎం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఆలయంలో నీటి లీకేజీల విషయంలో రాజీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.