యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ బాహ్య ప్రాకారంలోని అష్టభుజి మండపాల వద్ద చెక్కిన చిత్రాలు తొలగించారు. ఆలయ పిల్లర్లపై కేసీఆర్, కారు, కేసీఆర్ కిట్, రితహారం, నెహ్రు, ఇందిరా గాంధీ వంటి చిత్రాలు చెక్కడం పలు విమర్శలకు దారితీసింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక కళా ఖండాలను మాత్రమే పొందుపరుస్తున్నామని యాడా అధికారులు తెలిపారు.
యాదాద్రి ఆలయంలో వివాదాస్పద చిత్రాల తొలగింపు - kcr images in yadadri
యాదాద్రి ఆలయంలో మండపాలపై చెక్కిన వివాదాస్పద చిత్రాల తొలగింపు చర్యలు చేపట్టారు. పిల్లర్లపై కేసీఆర్, కారు, హరితహారం, ఇతర నేతల చిత్రాలు చెక్కడంపై రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది.
యాదాద్రి ఆలయంలో వివాదాస్పద చిత్రాల తొలగింపు