యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో ఆటోలో తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అలాగే పిపల్ పహాడ్ గ్రామంలో కారులో తరలిస్తున్న లిక్కర్‌ను సీఐ వెంకటేశ్వర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు వీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డబ్బు, అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యాదాద్రి జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత - ఎన్నిల ఏర్పాట్లు
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో నగదు, మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లాలో కారులో తరలిస్తున్న మద్యాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మద్యం పట్టివేత