యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతోన్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. మున్సిపల్ కమిషనర్ మహమూద్ అలీకు అఖిలపక్షం వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. మార్కెట్ స్థలంలో అక్రమ నిర్మాణం కేసుపై కోర్టులో విచారణ జరుగుతోన్నప్పటికీ.. మళ్లీ నిర్మాణం చేపడుతోన్నారని నేతలు పేర్కొన్నారు.
'మోత్కూరులో అక్రమ నిర్మాణాలను అడ్డుకోండి' - అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో అక్రమ నిర్మాణం కేసుపై కోర్టులో విచారణ జరుగుతోన్నప్పటికీ.. గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ నిర్మాణం చేపడుతోన్నారని అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.
'అక్రమ నిర్మాణాలను అడ్డుకోండి'
ఈ మేరకు కమిషనర్ స్పందించారు. విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు.