తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధి కావాలంటే బూర నర్సయ్య​నే గెలిపించాలి'

అభ్యర్థుల తరపున సతీమణుల ప్రచారం జోరుగా సాగుతోంది. భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గంలోని చౌటుప్పల్​లో ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భార్య బూర అనిత ఇంటింటి ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు.

చౌటుప్పల్​లో తెరాస మహిళా కార్యకర్తల ప్రచారం

By

Published : Apr 4, 2019, 11:17 AM IST

జాతీయ రహదారులు, రైల్వే మార్గం తదితర ప్రాజెక్టుల మంజూరు కోసం భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కృషి చేశారని ఆయన సతీమణి బూర అనిత తెలిపారు. భువనగిరి లోక్​సభ పరిధిలోని చౌటుప్పల్​లో తెరాస మహిళా కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. బూర నర్సయ్య ఎంపీగా చేసిన పనులను వివరిస్తూ కర పత్రాలను పంపిణీ చేశారు.
నిరుపేద కుటుంబంలో జన్మించి వైద్య వృత్తిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి అని గుర్తు చేశారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ కారు గుర్తుకు ఓటేస్తే భువనగిరిని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

కారు గుర్తుకు ఓటేస్తే భువనగిరిని మరింత అభివృద్ధి చేస్తాం : బూర అనిత

ABOUT THE AUTHOR

...view details