తెలంగాణ

telangana

ETV Bharat / state

తోపుడు బండి వ్యాపారులకు గుర్తింపు కార్డుల అందజేత - మోత్కూరు మున్సిపాలిటీ

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో తోపుడు బండి వ్యాపారులకు మున్సిపల్​ ఛైర్​పర్సన్​ సావిత్రి గుర్తింపు కార్డులను అందజేశారు. వారు వ్యాపారం చేసుకోవడానికి మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీకాంతా చారి చౌరస్తాలో దుకాణాల సముదాయ స్థలాన్ని చూపించారు.

Identity cards for sellers in yadadri bhuvangir district
తోపుడు బండి వ్యాపారులకు గుర్తింపు కార్డులు

By

Published : Jul 1, 2020, 12:44 PM IST

తోపుడు బండి వ్యాపారులకు గుర్తింపు కార్డులను అందించి.. దుకాణాల సముదాయ స్థలాన్ని చూపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్నిపల్ ఛైర్​పర్సన్​ తీపిరెడ్డి సావిత్రి వారికి అండగా నిలిచారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా పట్టణలో వీధివీధినా తిరిగి వ్యాపారం చేసి జీవితం గడుపుతున్న 324 మందిని గుర్తించి... వారిలో 248 మందికి మున్సిపాలిటీ తరపున గుర్తింపు కార్డులను అందించామని తెలిపారు. భవిష్యత్​లో గుర్తింపు పొందిన వారికి బ్యాంక్ ద్వారా రుణాలు పొందే ఏర్పాట్లు చేయనున్నట్లు మున్సిపల్​ ఛైర్​పర్సన్​ వెల్లడించారు. మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీకాంతాచారి చౌరస్తాలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా చౌరస్తాను వెడల్పచేసి గుర్తింపు పొందిన వారికి వ్యాపారం చేసుకునేందుకు స్థలాన్ని చూపించామని చెప్పారు.

ఇంకా ఎవరైనా వీధి వ్యాపారులు ఉంటే కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. పట్టణ ప్రదాన రహదారి ఇరువైపులా ఉన్న దుకాణాదా‌రులు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సహకరించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్ మనోహర్ రెడ్డి, మున్సిపల్​ వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య , మున్సిపల్​ మేనేజర్ శంకర్ పాల్గొన్నారు

ఇవీ చూడండి: నారుమడిలో మంత్రి హరీశ్.. తిరుపతి అభిమానానికి జనం ఫిదా!

ABOUT THE AUTHOR

...view details