మరణంలోనూ వీడని బంధం - చావులోనూ ఒక్కటయ్యారు
అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు వృద్ధాప్యం వరకు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. కడదాక తోడుంటాడనుకున్న భర్త..జీవిత చరమాంకంలో తన కళ్ల ముందే కన్నుమూయడం ఆ ఇల్లాలి గుండె తట్టుకోలేక పోయింది. భర్త మరణించిన కాసేపటికే భార్య కన్నుమూసింది.
మరణంలోనూ వీడని బంధం
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో నల్లగంటి లక్ష్మీనారాయణ, సుక్కమ్మ దంపతులు నివసిస్తుండేవారు. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.
కొంతకాలం క్రితం లక్ష్మీనారాయణ అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 4న అతను మరణించాడు. భర్త మరణం తట్టుకోలేని ఆ ఇల్లాలి గుండె కాసేపటికే ఆగిపోయింది.
ఒకే రోజు భార్యాభర్తలిద్దరూ చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.