యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులు షేక్ హాజీ హైమద్, మహమ్మద్ మసూద్లను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ సుధాకర్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భువనగిరిలో రూ.30 వేల విలువైన గుట్కా పట్టివేత - అక్రమ గుట్కా స్వాధీనం
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను భువనగిరి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సరకు సీజ్ చేసి నిందితులను ఠాణాకు తరలించారు.
గుట్కా ప్యాకెట్లు సీజ్... నిందితులు ఠాణాకు తరలింపు