యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాఖీ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కావడంతో.. జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా చాలాసేపటివరకు సమస్య పరిష్కారం కాలేదు.
పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు - Toll Plaza
చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు