యాదాద్రిలో భక్తులు పొటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడం వల్ల భక్తులు భారీగా తరలి వచ్చారు. జనంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణకట్ట, ప్రసాదాల కౌంటర్, దర్శనం లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్య కొండపైకి వాహనాలు అనుమతించడం లేదు.
యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 2 గంటలు - యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 2 గంటలు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పొటెత్తారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు సమయం పడుతోంది.
క్యూలైన్లో భక్తులు