Yadadri temple rush: వరుసగా సెలవులు రావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. నారసింహుని దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. లడ్డూ కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. కొండకింద కల్యాణ కట్ట, సత్యనారాయణ మండపం జనాలతో నిండిపోయింది. స్వామివారి నిత్యపూజలు, నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
yadadri temple news: మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ భద్రత దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. కొండ కింద ఘాట్ రోడ్ వెంట భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుంటున్నారు. వైకుంఠ ద్వారం వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు... వాహనాలను వేరేవైపుగా మళ్లించారు.
గండిచెరువుకు హంగులు
sri lakshmi narasimha swamy temple reconstruction: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మహాదివ్యంగా తీర్చిదిద్దే క్రమంలో....... కొండకింద గండిచెరువును తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. పంచనారసింహుల ఆలయోత్సవాల్లో భాగంగా.....తెప్పోత్సవ నిర్వహణకు అనుగుణంగా..... చెరువులో మట్టితీత, తూము నిర్మాణపనులు చేపడుతున్నారు. పలుచోట్ల నుంచి క్షేత్ర సందర్శన కోసం వచ్చే యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగించే తీరులో... గండిచెరువును సుందరీకరించే పనుల్లో భాగంగా తూము నిర్వహణ చేపట్టినట్లు డీఈ బాలకృష్ణ తెలిపారు. కొండకింద ఉత్తరదిశలో గండిచెరువు చుట్టూ బండ్‌నిర్మాణంతో పాటు పరిసరాల్లో పచ్చదనం పెంచుతున్నారు. సుమారు రూ.40 కోట్ల అంచనాతో సుందరీకరణ పనులు చేపట్టారు. చెరువు నుంచి ప్రతి రెండు, మూడునెలలకు ఒకసారి నీటిని దిగువకు వదిలేలాల తూము నిర్మితమవుతోందని అధికారులు తెలిపారు.