YADADRI TEMPLE: వరుసగా సెలవులు రావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. నారసింహుని దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. లడ్డూ కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. కొండకింద పుష్కరిణి, కల్యాణ కట్ట, జనాలతో నిండిపోయింది. స్వామి వారికి నిర్వహించే నిత్య పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
YADADRI TEMPLE: యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ - నల్గొండ తాజా వార్తలు
YADADRI TEMPLE: వరుస సెలవులతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో స్వామి వారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. జనంతో ఆలయ పరిసరాలు, లడ్డుకౌంటర్లు కిటకిటలాడాయి.
యాదాద్రిలో భక్తల రద్దీ
శ్రీలక్ష్మీ నారసింహుడిని దర్శించుకుని భక్తులు పులకించిపోతున్నారు. మహా సంప్రోక్షణ తర్వాత స్వామివారి దర్శనభాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి క్షేత్రాన్ని కళ్లారా చూడడమే తప్ప... వర్ణించలేమని చెబుతున్నారు. శిల్ప కళ వైభవాన్ని చూసి తన్మయత్వం పొందుతున్నారు. దీక్షా పరుల మండపంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నారు.
ఇదీ చదవండి:కొండపైకి అన్ని వాహనాలను అనుమతించాలి.. స్థానికుల ఆందోళన