ప్రజల్లో అవగాహనా లోపం, అధికారుల నిర్లక్ష్యం కలిసి వ్యాక్సిన కేంద్రాల వద్ద టీకా కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు కేవలం వందమందికే టీకాలు ఇవ్వడం వల్ల ప్రజలు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు.
టోకెన్లు ఇచ్చిన వారికే వ్యాక్సిన్
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు వ్యాక్సిన్ కోసం ప్రజలు ఒక్కసారిగా గుమిగూడారు. అక్కడ ప్రతి రోజు 100 మందికే మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద భౌతికదూరం విస్మరించి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 600 మంది టీకా కోసం రాగా.. ముందుగా టోకెన్లు ఇచ్చినవారికి మాత్రమే ఆసుపత్రి సిబ్బంది వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో టీకా అందరికీ ఇవ్వాలని ప్రజలు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
భౌతికదూరం విస్మరిస్తున్నారు
జిల్లాలోని వలిగొండ, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి. ప్రజలు ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేంద్రం వద్దకు రాగా.. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ పంపిణీ కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం ముందుగా టోకెన్లు ఇచ్చిన 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని ఆందోళన చేశారు. అధిక సంఖ్యలో వ్యాక్సిన్ కోసం జనాలు రావటంతో కొవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రజలు భౌతిక దూరం మరచిపోయి గుంపులుగా చేరారు. ఆస్పత్రి సిబ్బంది వీరిని నియంత్రించలేక చేతులెత్తేశారు.
ప్రజల ఆందోళన