తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ.. తప్పిన ప్రమాదం - latest crime news laxmidevi kalwa

యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో నిన్న సాయంత్రం నుంచీ కురిసిన భారీ వర్షానికి ఓ ఇంటి గోడ కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఇద్దరు ఉన్నప్పటికీ... అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

house wall fell down in laxmidevi kalwa village
భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ.. తప్పిన పెనుప్రమాదం

By

Published : Aug 3, 2020, 11:26 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో నిన్న సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి ఇంటి గోడ కూలింది. అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన పాక రాములు ఓ రేకుల ఇంట్లో నివాసముంటున్నాడు.

గోడ కూలే సమయానికి ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉన్నప్పటికీ... వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. రాములు పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఉన్న ఒక్క గూడు కూలిపోవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details