యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు పలు గ్రామాల్లోని ఇళ్లలో పైకప్పులు కొట్టుకుపోయాయి. ఈ ప్రభావానికి పాత గోడలు పాక్షికంగా కూలిపోయాయి. కరెంటు స్తంభాలు సుమారు 40 వరకు నేలకొరిగాయి. మోత్కూరు, ఆత్మకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో 10 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.విద్యుత్ సిబ్బంది విరిగిన స్తంభాలకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం జొన్నలగడ్డ తండ, వెలుగుపల్లిలో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయి సుమారు 50 ఎకరాల వరకు మామిడి పంట నష్టం జరిగింది.
'ఈదురు గాలులకు కొట్టుకుపోయిన ఇళ్ల పైకప్పులు' - SURYAPETA DISTRICT
ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఇళ్ల పైకప్పులు నేలరాలిన సంఘటన యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో చోటు చేసుకుంది. సాయింత్రం మూడు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోగా సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
ఈదురు గాలులకు కొట్టుకుపోయిన ఇళ్ల పై కప్పులు