యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ సమయంలో మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన హోంగార్డులు.. వాటిని వదిలేసి ఎంచక్కా కునుకు తీశారు. ఈ ఫొటోలు బయటికి రావడంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Yaadadri: విధులు మరిచి.. హాయిగా కునుకుతీసి.. - Home cards sleep in yadadri Temple
విధులు నిర్వహించాల్సిన హోంగార్డులు బాధ్యతను గాలికి వదిలి నిద్రిస్తున్న ఘటన యాదాద్రి ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
![Yaadadri: విధులు మరిచి.. హాయిగా కునుకుతీసి.. Home Guard sleep in the Yadadri Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:21:47:1622339507-tg-nlg-81-30-nidhralo-homegardlu-ts10134-30052021071642-3005f-1622339202-873.jpg)
యాదాద్రి ఆలయంలో హోంగార్డుల కునుకు
హోంగార్డ్స్ విధులను మరచి నిద్రపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే వారు విధులను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో అర్థమవుతోందని పలువురు పెదవి విరుస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై హోంగార్డుల నుంచి వివరణ అడుగుతామని, సమాధానం సరిగా లేకుంటే చర్యలు తీసుకుంటామని యాదగిరి గుట్ట ఆలయ ఎస్పీఎఫ్ జమిందార్ తెలిపారు.