హైదరాబాద్ ఔషధ నగరి అని, నగరం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయ పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా భువనగిరికి చేరుకున్న గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో తన మిత్రుడు, జిల్లా భాజపా కార్యదర్శి నర్ల నర్సింగరావును కలిశారు. ఈ మధ్యనే వివాహమైన ఆయన కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించారు.
కొవిడ్ వ్యాక్సిన్ భారత్లో తయారవడం గర్వకారణం: దత్తాత్రేయ - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. ఈ రోజు భువనగిరి చేరుకున్నారు. పట్టణంలో భాజపా కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కరోనా సంక్షోభంలో రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని దత్తాత్రేయ సూచించారు.
![కొవిడ్ వ్యాక్సిన్ భారత్లో తయారవడం గర్వకారణం: దత్తాత్రేయ himachal pradesh governor bandaru datthatreya tour in yadadri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9851756-948-9851756-1607757739974.jpg)
హైదరాబాద్ ఔషధ నగరి: బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ ఔషధ నగరి: బండారు దత్తాత్రేయ
కొవిడ్ వల్ల తన రాజకీయ జీవితంలో గానీ, ప్రజా జీవితంలో గానీ ఎప్పుడూ ఇంత నిర్బంధాన్ని ఎదుర్కోలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో అందరూ ధైర్యంగా నిలబడాలని, కరోనా నియమాలను అందరూ పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ భారత్లో తయారవడం దేశానికి గర్వకారణమని అన్నారు. కొవిడ్ పైన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతతో ఉండి మరింత లబ్ధిపొందాలని బండారు దత్తాత్రేయ సూచించారు.
ఇదీ చదవండి:వసతిగృహాల్లో ఉండాలంటే కరోనా పరీక్ష తప్పనిసరి
Last Updated : Dec 12, 2020, 1:37 PM IST