హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం - bandaru dattatreya escaped an accident
11:22 December 14
హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ వాహనానికి ప్రమాదం..
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు భారీ ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద వాహనం అదుపుతప్పి కిందకు దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయ, డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ఈ ఘటన నుంచి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. రహదారి పై నుంచి కిందనున్న చెట్ల పొదల్లోకి కారు దూసుకెళ్లడం వల్ల.. ప్రమాదం తప్పింది. ఎస్కార్ట్ వాహనాన్ని అనుసరిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేగం తగ్గడంతోనే ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు బయలుదేరారు.