తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో హీరో నాని.. లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేకపూజలు - Famous Temples in Telangana

Hero Nani visited by Yadadri: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని హీరో నాని గురువారం సందర్శించారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆయన.. ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్లొన్న నానికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.

Hiro Nani visited by Yadadri
Hiro Nani visited by Yadadri

By

Published : Nov 10, 2022, 5:21 PM IST

Hero Nani visited by Yadadri: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని గురువారం సినీ హీరో నాని సందర్శించారు. ప్రధానాలయంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్న నానికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. నాని వెంట యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, డిప్యూటీ స్తపతి ఆకుల మొగిలి తదితరులు ఆయన వెంట ఉండి ఆలయ విశిష్టత వివరించారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవలో హీరో నాని

యాదాద్రికి నాని రావడంతో పలువురు భక్తులు, అభిమానులు తదితరులు ఆసక్తితో సెల్ఫీలు దిగేందుకు క్యూకట్టారు. ప్రస్తుతం నాని 'దసరా' సినిమాలో నటిస్తున్నారు. వచ్చేనెలలో ఈ చిత్రం విడుదల కానుంది.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న యాక్టర్​ నాని

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details