తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం ఆగంజేసింది... - Heavy Wind rain Latest news

రాష్ట్రంల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో వాతావరణం చల్లబడి వేసవి తాపం మాయమవుతున్నప్పటికీ.. ఈదురు గాలులు, వడగండ్ల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Heavy Wind rain in Yadaghirigutta district
అకాల వర్షం ఆగంజేసింది...

By

Published : May 31, 2020, 9:23 PM IST

యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూర్, మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని పలు కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. రోడ్లపైకి నీరు చేరటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటం వల్ల మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

యాదగిరిగుట్టలోని బీసీ కాలనిలో ఒక వ్యక్తి ఇంటి పై కప్పు రేకులు లేచిపోయాయి. మోటకొండూరు మండలంలోని చాడ గ్రామానికి చెందిన అబ్రహం రైతుకు చెందిన రెండు పాడి గేదెలు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి. వాటి విలువ సుమారు 90 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details